21: క్రమశిక్షణ అన్నది ఆపద అనే పాఠశాలలో నేర్చుకోబడుతంది.
22: క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
23: కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
24: గొప్పవాటినీ,చిన్నవాటిని- ఇలా రెండింటిని ప్రేమించేవాడే ఉత్తమమైన ప్రార్ధన చేసేవాడు.
25: పక్షపాత భావన అజ్ఞానపు శిశువు.
26: ప్రతికారం ద్వారా పగ నిర్మూలనం కాదు -రాజాజీ.
Chaduvu Sukthulu in Telugu :
27: ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం.
28: పుస్తకం విలువను ధర కాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.
29: పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.
30: మదలింపు తరువాత ప్రోత్సహించడమన్నది వాన తరువాత వచ్చే ఎండలాంటిది.
31: మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.
32: మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.
33: మరొకరి జీవితంలో సంభవిస్తున్నంత వరకు ప్రతి ఒక్కటి తమాషాగానే ఉంటుంది.
34: మీ మనసుకు శిక్షణనిచ్చి అభివృద్ధి పరచడం అన్నది మీ కర్తవ్యం.
Telugu Neethi Sukthulu :
35: దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు.
36: ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.
37: ఏమాత్రం ఉత్పత్తి చేయకుండా ఆరగించే జీవి మనిషి మాత్రం.
38: జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.
39: రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవదం- ఈ మూడూ చాలా కష్టతరమైన పనులు.
40: విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం